పెండ్లి చూపుల ఘట్టంలో విశేషాలు
సోదరిపై అలకబూనిన స్వామివారు
కళ్యాణోత్సవానికి తరలివస్తున్న జనం
సింహాచలం, ఆంధ్రప్రభ : సింహాచలం వరహాల లక్ష్మీనరసింహ స్వామి వారు పెళ్లి కొడుకు అవుతున్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీన స్వామివారికి పెళ్లి చూపుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సహోదరి పైడితల్లి అమ్మవారి కుమార్తెను శ్రీ స్వామి వారు పరిణయం చేసుకోనున్నారు. దీంతో అమ్మవారి కుమార్తెను పెళ్లిచూపులకు గాను ఈ నెల 14వ తేదీన స్వామి వారు సింహగిరి పైనుంచి కొండ దిగువకు రానున్నారు.
స్వామి వారు అలిగిన వేళ..
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా చాలా తతంగం సాగనుంది. ఆయన సహోదరి పైడితల్లి అమ్మవారి కుమార్తెను చేసుకునే క్రమంలో ఆసక్తికర సన్నివేశాలు జరగనున్నాయి. పెళ్లి చూపులకు వచ్చిన స్వామివారిని చూసి అమ్మవారు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు నిరాకరించడం పెళ్లిచూపుల ఉత్సవంలో తొలి ఘట్టం. తన సహోదరి కుమార్తెను ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ క్రమంలో స్వామివారు అలకబూనుతారు. ఈ విషయం తెలుసుకొని స్వామివారి విశిష్టతను అమ్మవారికి వివరించే ఘట్టాలు కూడా ఉండనున్నాయి. కాగా, అప్పన్న కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.