Devotional | పెద్దగట్టుకు ఎమ్మెల్సీ కవిత – చౌడమ్మ తల్లికి బోనం
సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతు స్వామి జాతర సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. మంగళవారం దురాజ్‌పల్లి సమీపాన జరుగుతున్న జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకుని పెద్దగట్టుకు వెళ్లి చౌడమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు.
బోనం సమర్పించడం నా అదృష్టం
చౌడమ్మ అమ్మవారి బోనం చెల్లించడం తన అదృష్టమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతి పెద్ద జాతర లింగమంతుల జాతర అని, తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం, సంస్కృతికి లింగమంతుల జాతర నిదర్శనమన్నారు. ఈ జారతకు కేసీఆర్ హయాంలో రూ.14 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఆమెతోపాటు స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.