వాజేడు ఏప్రిల్ 13 ఆంధ్రప్రభ : తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలం లొట్టపిట్ట గండి గుట్టలపై వెలసి ఉన్న బీరమయ్య జాతర అత్యంత కోలాహాలంగా జరుగుతుంది. ఇటు తెలంగాణ అటు చతిస్గడ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాల నుండి భక్తజనం అధిక సంఖ్యలో హాజరు కావడంతో లొట్టపిట్ట గండి భక్తులతో కిక్కిరిసిపోయి జనసంద్రంగా మారింది. ప్రతి ఏట శ్రీరామనవమి జరిగిన మొదటి వారంలో ఈ బీరమయ్య జాతరను గిరిజన సాంప్రదాయ బద్ధంగా వాజేడు మండలం టేకులగూడెం గిరిజనులు నిర్వహిస్తారు.

ఈ బీరమయ్య జాతరకు పలు రాష్ట్రాల నుండి లక్షలాదిమంది భక్తులు హాజరై తమ మొక్కులను తీర్చుకుంటారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాటు చేశారు.
నిన్న ఉదయం ప్రారంభమైన ఈ జాతర రేపటితో ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు
ఈ జతరకు హాజరైన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించి ఇక్కడే భోజనాలు తయారుచేసుకొని ఇలా పాపాలతో కుటుంబ సమేతంగా ఈ ప్రాంగణంలో గడిపి సాయంత్రం సమయానికి ఇంటికి చేరుకుంటారు. బీరమయ్య అంటే భీష్మ శంకరుడు ఈ జాతరను గత 40 సంవత్సరాలుగా ఇక్కడ గిరిజనులు నిర్వహిస్తూ ఉన్నారు.