Devotees | పురాత‌న విగ్రహం గుర్తింపు… ప్ర‌త్యేక పూజ‌లు..

Devotees | పురాత‌న విగ్రహం గుర్తింపు… ప్ర‌త్యేక పూజ‌లు..

Devotees | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో కొన్ని దశాబ్దాలుగా దీప దూఫ నైవేద్యానికి నోచుకోని అతి పురాతన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని గుర్తించి ఈ రోజు భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. గతంలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని తొగట వీర క్షత్రియుల కులం (తొగటి) కులస్తులు కొలిచేవారు. కాలక్రమేణ దేవాలయం చుట్టూ ముళ్ల పొదలు పెరిగి కొన్ని దశాబ్దాలుగా దీప దూప నైవేద్యానికి నోచుకోకుండా దేవాలయం శిథిలావస్థకు చేరింది. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయం శిథిలావస్థకు చేరుకుని అమ్మవారి విగ్రహం మాత్రమే మిగిలి ఉంది.

గత వారం రోజుల క్రితం కొంతమంది భక్తులు అమ్మవారి పురాతన విగ్రహాన్ని గుర్తించారు. గ్రామపంచాయతీ వారి సహకారంతో జేసీబీతో ముళ్లపొదలు తొలగించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దేవాలయం పునఃనిర్మాణానికి కొంతమంది భక్తులు సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు వచ్చారు. తోగట కులస్థులు తొగటి నర్సిములు, సరస్వతి, జగదీష్, కవిత, తోగటి శ్రీనివాస్, తోగటి నరేష్, తోగటీ నగేష్ తదితరులుఅమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం చుట్టూ ఇనుప కంచే, సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తానని దుప్పరి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక భరత్, మాజీ జెడ్పీటీసీ అరవింద్ కుమార్, మాజీ సర్పంచ్ భాస్కర్, ఉప సర్పంచ్ ఆర్. రమేష్, వార్డు మెంబర్లు సువర్ణ రవికుమార్, అనిల్ రెడ్డి, నరేష్, వడ్డే మంగమ్మ చిన్న హన్మంతు, గ్రామ పెద్దలు గరిడి లక్ష్మారెడ్డి, శ్రీ. కృష్ణయ్య గౌడ్, హన్మంతు, లక్ష్మణ్, విటోభ, వెంకట్ నారాయణ, కేశవరావు, జగన్నాథ రావు, ఎంగల్ రాములు, రఘువీర్ స్వామి, దుప్పలి శ్రీను, కోట్రిక్ రాజు, కూతలి నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply