Devotees | కన్నుల పండుగగా చండీహోమం

Devotees | కన్నుల పండుగగా చండీహోమం
- లోక కళ్యాణార్థం చండీహోమం నిర్వహించాం.. పూజారులు
Devotees | కరీమాబాద్, ఆంధ్రప్రభ : లోక కళ్యాణార్థం నిర్వహించిన చండీహోమం కన్నుల పండుగగా వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించారు. ఇవాళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని 34వ డివిజన్ శివనగర్ శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో వందలాది మంది భక్తుల సమక్షంలో చండీహోమం నిర్వహించారు. ఇవాళ్టి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉందని, అన్ని విధాలా విజయాలు సమకూర్చేందుకు చండీహోమం నిర్వహించడం జరిగిందని, హోమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ పూజారులు ముదిగొండ అభిషేక్ ముక్కు కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ కార్యనిర్వాహకులు వడ్నాల మల్లయ్య, మాచర్ల వెంకటేశ్వర్లు, బుదారపు భాస్కర్, పాశికంటి రవికుమార్, పాషికంటి రాజేశ్వరరావు, ఉరుగొండ సారంగపాణి, రాంపల్లి చంద్రమౌళి, దాసి సురేందర్, తవుటం మధు, బైరి శ్యామ్, రాజలింగం, కస్తూరి శ్రీనివాస్, భక్తులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
