Devisri prasad | ఎల్లమ్మ వెనకున్న కథ ఇదే..

Devisri prasad | ఎల్లమ్మ వెనకున్న కథ ఇదే..

Devisri prasad | బలగం వేణు దర్శకత్వంలో దేవిశ్రీ హీరోగా ‘ఎల్లమ్మ’
గాసిప్ అనుకున్న వార్త నిజమైంది ఎలా?
నాగార్జునను మెప్పించిన రాక్ స్టార్ లుక్
హీరోగా మారడానికి దేవిశ్రీకి ప్రేరణ ఎవరు?
నెలలో 10 రోజులు మాత్రమే షూటింగ్ – దిల్ రాజు ప్లాన్
‘దేవి’తో మ్యూజిక్ డైరెక్టర్… ‘ఎల్లమ్మ’తో హీరో
ఈ ఏడాదే రిలీజ్? అభిమానుల్లో భారీ ఆసక్తి

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బలగం వేణు రెండో సినిమా ఎల్లమ్మ. ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. హీరో ఎవరు అనేది కన్ ఫర్మ్ కావడానికి చాన్నాళ్లు పట్టింది. ఫైనల్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీని హీరోగా పరిచయం చేస్తానని సుకుమార్ అంటేనే కుదరలేదు. మరి.. బలగం వేణు డైరెక్షన్ లో నటించేందుకు దేవిశ్రీ ఎలా ఒప్పుకున్నారు..? దిల్ రాజు ఏం చెప్పారు..? అసలు రాక్ స్టార్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటి…?

Devisri prasad | నాగ్ ని మెప్పించిన రాక్ స్టార్..

Devisri prasad

ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటించనున్నారని ప్రచారం జరిగినప్పుడు ఇదేదో గాసిప్ అనుకున్నారు. అయితే.. ఫైనల్ గా ప్రచారంలో ఉన్న వార్తే నిజమైంది. ఇటీవల అనౌన్స్ చేసిన వీడియోతో దేవిశ్రీ.. షాక్ ఇచ్చాడనే చెప్పచ్చు. ఆయన లుక్ చూసి.. ఇదేదో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలానే ఉందనే ఫీలింగ్ కలిగింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున సైతం.. సోషల్ మీడియాలో దేవిశ్రీ లుక్.. ఆ విజువల్స్ చూసి స్పందించారంటే.. ఎంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అనౌన్స్ మెంట్ వీడియోతోనే మెప్పించిన రాక్ స్టార్ ఇక స్క్రీన్ పై ఎంతలా నటిస్తాడనేది ఆసక్తిగా మారింది.

Devisri prasad | నెలలో 10 రోజులు మాత్రమే..

Devisri prasad

ఇక అసలు విషయానికి వస్తే.. దేవిశ్రీ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో.. తను హీరోగా మారడం వెనక జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు. ఇంతకీ ఏం చెప్పారంటే.. సుకుమార్.. తనని హీరోగా పరిచయం చేస్తానని చెప్పారట. ఆ టైమ్ లో.. తన తండ్రి చనిపోవడం.. ఆతర్వాత పరిస్థితుల వలన ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని చెప్పారు. అయితే.. తనని హీరోగా నటించమని.. త్రివిక్రమ్, హరీష్ శంకర్, ప్రొడ్యూసర్స్ ఎస్ థాను, దిల్ రాజు ఎంతగానో ప్రొత్సహించారని చెప్పారు. ఈ సినిమాలో నటించడం వలన తన మ్యూజిక్ కెరీర్ డిస్ట్రిబ్ కాకూడదనే ఉద్దేశ్యంతో నెలలో 10 రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వమని.. ఆ విధంగా షూటింగ్ ప్లాన్ చేసుకుంటామని దిల్ రాజు చెప్పారట.

Devisri prasad | దేవితో మ్యూజిక్ డైరెక్టర్.. ఎల్లమ్మతో హీరో..

Devisri prasad

దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ అయ్యింది.. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ కావడం.. దైవ నిర్ణయంగా భావిస్తున్నాను అని చెప్పారు. ఈ విధంగా హీరోగా నటించడం వెనక జరిగిన విషయాలను బయటపెట్టారు రాక్ స్టార్. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఈ ఇంటర్ వ్యూ వైరల్ అయ్యింది. ఈ ఇయర్ లో నే ఈ క్రేజీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఎల్లమ్మ మూవీతో దేవిశ్రీ ప్రసాద్ ఎంత వరుకు మెప్పిస్తాడో.. ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.

Leave a Reply