Development | గ్రామాల అభివృద్ధిలో సర్పంచులది కీలక పాత్ర…

Development | గ్రామాల అభివృద్ధిలో సర్పంచులది కీలక పాత్ర…
Development | చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచులదే కీలక పాత్ర అని నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం తెలిపారు. మండలంలోని పెద్దకాపార్తి గ్రామానికి చెందిన సర్పంచుల మండల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం ఎన్నికయ్యారు. ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశంను శాలువా, పూల బొకేలతో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో కలిసి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) మాట్లాడుతూ… సర్పంచులు అందరూ ఐక్యతతో ఉండి గ్రామాల అభివృద్ధి చేయాలని, గ్రామాల అభివృద్ధి(Development)కి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని సర్పంచులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు జోగు సురేష్, ప్రధాన కార్యదర్శి ఆవుల సునీత యాదయ్య సుంకేనపల్లి, కార్యదర్శి మిర్యాల వెంకటేశం, కోశాధికారి మహిపాల్ రెడ్డి, సర్పంచులు ఆవుల సుందర్, సాగర్ల యాదమ్మ యాదయ్య, కట్ట ఆశయ, అందే అండాలు రాములు తదితరులు పాల్గొన్నారు.
