Development | అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి..

Development | అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి..

Development | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామ ప్రజలు అందరూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి అనవేన సృజన రమేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను(public issues) పరిష్కరిస్తామని అన్నారు.

ఆపదలో ఆదుకుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి(Development of the village) చేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply