Development | అభివృద్ధిలో శ్రీకాకుళాన్ని అగ్రభాగాన నిలుపుదాం

Development | అభివృద్ధిలో శ్రీకాకుళాన్ని అగ్రభాగాన నిలుపుదాం

  • కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

Development | శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ : నూతన సంవత్సరం 2026 సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో మరిన్ని అభివృద్ధి(Development) పనులు చేపట్టి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ..

వచ్చే ఏడాదిలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన పేదలందరికీ సకాలంలో అందేలా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జిల్లాలో జరగనున్న అరసవిల్లి రథసప్తమి వేడుకలను ఈసారి రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందని, దీనిని ఏడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. యువత దురలవాట్లకు దూరంగా ఉండి, విద్యా రంగంలో జిల్లా పేరును నిలబెట్టాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply