అభివృద్ధి అంటే మాటలతో కాదు… చేతలో చేసి చూపిస్తా

  • గ్రామ సర్పంచ్ అభ్యర్థిని రాగుల లత మోహన్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నీతి, నిజాయతీతో గ్రామ అభివృద్ధి సేవలు చేస్తానని ముందుకు వస్తూ, ప్రజలకు, మహిళలకు, యువకులకు ఒక్కసారిగా అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటు వేస్తే సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపిస్తానని రాగుల లత మోహన్ ఓటర్లను కోరారు. శుక్రవారం బడా భీమ్‌గల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా రాగుల లత మోహన్, ఆంధ్రప్రభ పత్రిక విలేకరులతో గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై ముచ్చటించారు.

ఆమె హామీ ప్రకారం, బడా భీమ్‌గల్ గ్రామ సర్పంచ్ గా గెలిచిన వెంటనే మొదటి పని గ్రామంలోని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడం. గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడం. భర్త చాటు భార్యగా కాకుండా, స్వతంత్ర మహిళా పరిపాలకురాలిగా పని చేయడం.

రాగుల లత మోహన్ ఓటర్లకు మాట్లాడుతూ… “మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను. మీ అమూల్య ఓటు కత్తెర గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే, అది గ్రామ అభివృద్ధికి వజ్రయుధం అవుతుంది. నేను నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో కృషి చేస్తాను.”

ఆమె చెప్పారు: “గ్రామాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తాను. త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, వ్యవసాయ సమస్యలు, పేదలకు సహాయం చేయడం నా ప్రధాన లక్ష్యం. సామాజిక న్యాయం, ప్రజల విశ్వాసం సాధించడం కోసం ప్రజాసేవకురాలిగా పనిచేస్తాను” అని హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ మహిళలు, అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply