Development | ఉద్యోగుల గ్రీవెన్స్ డే వాయిద

Development | ఉద్యోగుల గ్రీవెన్స్ డే వాయిద
- 22న నిర్వహణ : కలెక్టర్ డీకే బాలాజీ
Development | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఉద్యోగుల గ్రీవెన్స్ డేను వాయిదా వేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని 22వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
19వ తేదీన (శుక్రవారం) జిల్లా అభివృద్ధి సమీక్ష(Development review) కమిటీ సమావేశం (డీఆర్ సీ) నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల గ్రీవెన్స్ దినాన్ని వచ్చే 22వ తేదీ (సోమవారం) ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్(Collector) వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఈ మార్పును గమనించాలని కోరారు.
