Development | గెలుపు దిశగా…

Development | గెలుపు దిశగా…

  • ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి….
  • సేవ చేసేందుకు అవకాశం కల్పించండి

Development |మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : ఉంగరం గుర్తుకు ఓటెయ్యండి, మీ సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రజలను పోగుల భాగ్యశ్రీ సదానందం కోరుతున్నారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామంలో ప్రతి వాడ సంక్షేమ పథకాలు అమలు చేయిస్తానని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు(Government Schemes) అందేలా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

ఉంగరం గుర్తుకు ఓటేసి అవకాశం కల్పిస్తే బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తానని ఆమె తెలిపారు. ప్రజల్ని కంటికి రెప్పల కాపాడుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు. గెలిచిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు యువత, మహిళల అభివృద్ధికి ప్రోత్సాహకం అందజేస్తానని ఆమె తెలిపారు. ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం కల్పించాలని మంథని మండలంలోని బిట్టుపల్లి గ్రామాన్ని అభివృద్ధి(development)లో అగ్రగామిక నిలుపుతానని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply