Development | అభివృద్దే ధ్యేయం..
Development | టేకుమట్ల, ఆంధ్రప్రభ : ఆశీర్వదించండి.. అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని సర్పంచ్ అభ్యర్థి అనవేన సృజన రమేష్ అన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్దే ధ్యేయంగా పని చేస్తాను అన్నారు. వెంకట్రావు పల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, వాడవాడలా ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు.
గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తానని, రోడ్లను, మురికి కాల్వలను మరమ్మత్తు చేయించి అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మహిళలు, యువత అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. సేవకునిగా అంకితభావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ అందరికీ చేదోడువాదోడుగా ఉంటాను అన్నారు. అలాగే గ్రామంలో కోతుల బెడద నుండి విముక్తి కలిగే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

