Development | 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

Development | 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా

Development | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జి.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే 12వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చెయ్యి గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

బస్తీల్లో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధి లైట్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని ప్రవీణ్ స్పష్టం చేశారు.

Leave a Reply