Deputy CM |మా కడుపు కొడుతున్నారు..

Deputy CM |మా కడుపు కొడుతున్నారు..
- ఫారెస్ట్ అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు
Deputy CM | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని అటవీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ అటవీ ఉత్పత్తులు(Forest products) తయారు చేసి అమ్ముకుని జీవనం సాగిస్తున్న మేదర, ఎరుకలి, యానాది పెద్దలకు కూడా వృత్తులను శాఖ అధికారులు దాడులు చేస్తూ మా జీవనాన్ని కడుపు కొడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan)కు ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. మహానంది మండలం జనసేన నాయకులు మారెడ్డి రామయ్య, నల్లభోతుల మల్లిఖార్జున ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రికి వందలాదిమంది కలిసి వినతి పత్రం ఇచ్చారు.

జిల్లాలోని పలు మండలాలలో గాజులపల్లె, ఆర్ఎస్ గాజుల పల్లె, తిమ్మాపురం మహానంది, పచ్చర్ల, బసాపురం, మేదరి, ఎరుకల, చెంచు జీవనాధారమైన విసనకర్ర చంద్రికలు చాటలు, గంపలు, తడికలు మొదలగు వాటిపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. వీరి జీవన విధానంపై అటవీశాఖ అధికారుల దాడులను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. ఈ జిల్లాలో జరుగుతున్న ఈ సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి జిల్లాలోని జనసేన పార్టీ(Janasena Party) నాయకులు తీసుకెళ్లారు.
సమస్యలపై వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. ఆ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని(solve) హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మూడు నెలల క్రితం ఫారెస్ట్ అధికారులు జప్తు చేసిన వాహనాలను వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మిద్దె శివ, శ్రీశైలం, నాగ సాయి రామ్, సురేష్, ప్రసాద్, కళ్యాణ్, శ్రీను, రవి శివ శ్రీకాంత్ నాగేశ్వర్ రావు, రంగ సాయి, మెదరి ఎరుకల కులస్తులు భారీగా పాల్గొన్నారు. సదరు సమస్యపై సానుకూలంగా స్పందించినటువంటి డిప్యూటీ సీఎం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వాళ్ళు వారి జన్మంతం రుణపడి ఉంటామని తెలియజేశారు.
