పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం

పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల ప్రొహిబిషనరీ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో వివిధ నేరాల పై పట్టుబడిన వాహనాలను నిర్వహించనున్నట్లు పరకాల ఎక్సైజ్ సీఐ తాతాజీ తెలిపారు. పరకాల ప్రొహిబిషనరీ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో వాహనాలను జిల్లా ప్రొహిబిషనరీ అండ్ ఎక్సైజ్ అధికారి వరంగల్ రూరల్ ఆదేశను ప్రకారం తేదీ 10.3.2026 (మంగళవారం) రోజున ఉదయం 11:00 గంటలకు వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఆసక్తి కలిగినవారు పరకాల ప్రొహిబిషనరీ అండ్ఎక్సైజ్ స్టేషన్ లో వాహనం అప్ సెట్ ప్రైస్ పై 50% డిపాజిట్ గా చెల్లించి వేలం లో పాల్గొనాలని పరకాల ఎక్సైజ్ సీఐ పి తాతాజీ తెలిపారు.
