Deported | ఇప్పుడు బ్రిట‌న్ వంతు – అక్ర‌మ‌వల‌సదారులు ఏరివేత షురూ

ఇండియ‌న్స్ మాల్స్, హోట‌ల్స్, కార్ వాష్ లో త‌నిఖీలు
ఇప్ప‌టికే వంద‌ల మంది అరెస్ట్
తొలిబృందం భార‌త్ కు పంపేందుకు గ్రీన్ సిగ్న‌ల్
అక్క‌డ ఇండియ‌న్స్ లో అల‌జ‌డి

ఇంగ్లండ్ – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ఫూర్తితో ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియను మొదలుపెట్టింది. యూఎస్‌లో మాదిరిగానే చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వలసదారులను హడలెత్తిస్తోంది. ‘యూకే వైడ్ బ్లిట్జ్‌’ పేరుతో దేశవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు సోదాలు చేపట్టారు. ముఖ్యంగా భారతీయ రెస్టరెంట్లు, నెయిల్ బార్‌లు, కన్వీనియన్స్ స్టోర్లు, కార్ వాష్‌ ఏరియాలను టార్గెట్ చేసి వందల మందిని అరెస్టు చేశారు. వారంద‌ర్ని త్వ‌ర‌లోనే ఇండియాకు పంప‌నున్నారు.

భారతీయ రెస్టారెంట్లే టార్గెట్..

తాజాగా నార్త్ ఇంగ్లాండ్‌లోని హంబర్‌సైడ్‌ ప్రాంతంలో ఉన్న ఒక భారతీయ రెస్టారెంట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోం శాఖ ప్రకటించింది. సౌత్ లండన్‌లోని ఓ ఇండియన్ గ్రాసరీ వేర్‌హౌస్‌లో సోదా చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గత నెలలో ఎక్కువగా రెస్టారెంట్లు, టేక్‌అవేలు, కేఫ్‌లతో పాటు ఆహారం, పానీయాలు పొగాకు పరిశ్రమలో జరిగాయని హోం ఆఫీస్ తెలిపింది. అలాగే అన్ని రంగాలలో పనిచేస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది.

అక్రమ వలసలను ఉపేక్షించం : యూకే ప్రభుత్వం
గతేడాది జూలైలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అక్రమ వలసల ఏరివేతపై దృష్టిసారించింది. దేశంలో వలసలు విపరీతంగా పెరిగిపోయి అక్రమంగా పనిచేస్తున్న వారు ఎక్కువ అవుతున్నారని ఇటీవల బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్ట వ్యతిరేక వలసలు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. బ్రిటన్ అధికారిక గణాంకాల ప్రకారం, ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు జనవరిలో రికార్డు స్థాయిలో 828 ప్రాంగణాలపై దాడులు చేసి చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న 609 మందిని అరెస్టు చేశాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో దాడులు 48 శాతం పెరిగాయి. అరెస్టుల సంఖ్య గత సంవత్సరం కంటే 73 శాతం పెరిగింది. ఇప్ప‌టికే అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై భార‌త్ కు ఇంగ్లండ్ ప్ర‌భుత్వం స‌మాచారం ఇచ్చింది.. వీసా ముగిసిన ప్ర‌తి ఒక్క‌ర్ని పంపివేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *