దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్..
గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర రావు(Ram Chandra Rao) తీవ్రంగా ఆరోపించారు. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్(Etaa Madhukar) ఆత్మహత్యకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేయడంతో పాటు ఇతర దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్(Amber Kishore)కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఫిర్యాదు చేశారు.
అనంతరం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రాంతంలో రామచంద్ర రావు మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థను వినియోగించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా ప్రకటించారు. బీజేపీ(BJP) శ్రేణులపై కాంగ్రెస్ నేతలు బెదిరింపులు, దాడులకు పాల్పడుతుందని ఇలాంటి ఘటనలకు పోలీస్ వ్యవస్థ సహకారంగా ఉండటంపై రామచంద్ర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని విమర్శించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్యకు కారకులైన ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బందిని సస్పెండ్(suspended) చేయాలని అదేవిధంగా మధుకర్‌ను బెదిరింపులకు గురిచేసిన కాంగ్రెస్ దుండగులు అందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పోలీసులను కార్యకర్తల్లా వాడుకుంటున్నారని, ఇంతకన్నా దుర్వినియోగం ఏముంటుంది ప్రశ్నించారు.
బీజేపీ శ్రేణులపై అధికార పార్టీ కాంగ్రెస్(Congress) దాడులను ఎదుర్కొంటామని కాషాయ శ్రేణులకు బీజేపీ నాయకత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని రామచంద్రరావు భరోసా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పెద్దపెల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్(Borlakunta Venkatesh) నేత, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకన్న, నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి, నేతలు గోమాస శ్రీనివాస్, రావుల రాజేందర్, మీసా అర్జున్ రావు, సోమారపు లావణ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.
మధుకర్ కుటుంబానికి అండగా ఉంటాం :
మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబానికి బీజేపీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు తెలిపారు. పోలీసుల వేధింపులు, కాంగ్రెస్ నేతల బెదిరింపుల మూలంగా మధుకర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను బీజేపీ సీరియస్‌గా పరిగణిస్తుందని, బాధ్యులైన వారిపై పోలీస్ శాఖ(Police Department) కఠిన చర్యలు తీసుకునే అంతవరకు ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో విచారణ జరిపించి, అందరిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
