Delhi | డబుల్ ఇంజన్ సర్కార్ తోనే.. దేశ అభివృద్ధి

  • ఢిల్లీ లో ఎగిరిన కాషాయ జెండా తెలంగాణలో గల్లీ, గల్లీలో ఎగురుతుంది..
  • నూతన సీఎం రేఖ గుప్తా ను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : నరేంద్రమోదీ నాయకత్వా న్ని దేశాప్రజలందరు కోరుకుంటున్నారని డబుల్ ఇంజన్ సర్కార్ తోనే దేశ అభివృద్ధి జరుగుతుందని ఎంపీ ధర్మ పురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. శుక్రవారం ఢిల్లీ సచివాలయంలోఢిల్లీ నూతన ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖ గుప్తాని ఎంపీ అరవింద్, ధన్పాల్ సూర్యనారాయణలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీ సీఎం రేఖ గుప్తాను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మె ల్యే లు మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం మహిళలకు పెద్ద పిఠ వేస్తుందనడానికి ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన రేఖ గుప్తాని ముఖ్యమంత్రిగా చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. బిజెపి పార్టీలో నిబద్దతతో పని చేస్తే కార్యకర్తలను సైతం పార్టీ అందలం ఎక్కిస్తుందని అలా సంఘ్ నుండి సామాన్య కార్యకర్తగా నేడు ఢిల్లీకి అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేఖ గుప్తా ఆదర్శమని తెలిపారు.

మహిళలను రాజకీయంగా రాణించాలి అనే ఉద్దేశంతోనే బిజెపి మహిళా రిజర్వేషన్ బిల్ కూడా తీసుకురావడం జరిగిందన్నారు. అవినీతి అప్ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు చీపురుతో ఊడ్చి చెత్త బుట్టలో వేసారన్నారు. ఢిల్లీలో ఎగిరిన కాషాయ జెండా తెలంగాణలో గల్లీ, గల్లీలో ఎగురుతుందని ధీమా వ్యక్తం చేసారు.

Leave a Reply