Delhi Metro | ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Delhi Metro | ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రూ.12,015 కోట్లతో 16 కి.మీ కొత్త లైన్


Delhi Metro | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ మెట్రో (Delhi Metro) విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.12,015 కోట్లతో మెట్రో నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనుంది. మొత్తం 16 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించనున్నారు. ఇందులో 10 అండర్‌గ్రౌండ్ స్టేషన్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి.

మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణతో ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలకు మెట్రో సేవలు (Metro services) మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.

Leave a Reply