న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శన అద్భుత స్పందనను పొందుతోంది. జూలై 26 (శనివారం) రాత్రి 7 గంటలకు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన తొలి షో పూర్తి హౌస్‌ఫుల్ అయింది.
ఈ సందర్భంగా రేపు (జూలై 27, ఆదివారం) మరోసారి స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ రెండో షో కూడా ఏపీ భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలోనే జరుగనుంది. ఈ సినిమాను ప్రత్యేకంగా ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ప్రదర్శిస్తున్నారు.