జైనూర్, మార్చి 7 (ఆంధ్రప్రభ) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మర్లవాయి పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గుస్సాడి బృందం సభ్యులు శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ను సందర్శించారు. అంతరించిపోతున్న సాంస్కృతిక సాంప్రదాయల గూర్చి గుస్సాడి బృంద సారధి కనక సుదర్శన్ వివరించారు.
ఐజిఎన్,సి,ఏహెచ్ ఓ డి కి కలిసి సన్మానించినట్లు ఆయన తెలిపారు. ఆయన అన్నివిధాలా జాతీయ స్థాయిలో సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుటకు మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుస్సాడి బృంద ఇంచార్జ్ గౌ.హిమగిరి బృంద సభ్యులు ఎర్మా.హనుమంతు సోయం, రమేష్ ఉయిక, చందు పంద్రం, ప్రసాద్, ఆత్రం, అర్జున్ పూసం, కేశవ్ ఆత్రం, తెలంగారవ్ మదవి, సోమేశ్ సిదాం, గోపాల్, మొదలగు వారు పాల్గొన్నారని గుస్సాడి రథసారథి కనక సుదర్శన్ తెలిపారు.