- మాజీ భారత గుఢాచారికి ఢిల్లీ కోర్టు వార్నింగ్
భారత నిఘా సంస్థ.. రిసెర్చ్ అనాలసిస్ వింగ్ (Research Analysis Wing).. అంటే.. అత్యంత రహస్యం. అందులో పని చేసే సభ్యులు.. అదే గుడాచారులెవరో? ఆ 116 ఏజెంట్లు ఎవరో.. ఎవరికీ తెలీదు. యావత్ ఈ ప్రపంచానికే ఎరుక లేదు. కానీ మాజీ రా అధికారి (Ex R &AW Officer) భారత న్యాయస్థానానికి అడ్డంగా దొరికిపోయాడు. బలవంతపు వసూళ్లు, కిడ్నాప్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ దోస్తానా కథలపై కేసు నమోదు కాగా.. ఆ అజ్ఞాత గుఢాచారి అదృశ్యమయ్యాడు.
విచారణకు హాజరు కావాలని కోర్టు ఎన్ని సార్లు పిలిచినా.. అతడు ప్రత్యక్షం కాలేదు. కిడ్నాప్, దోపిడీ కేసులో నిందితుడు బోనులోకి రాలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ బీ డబ్ల్యూ జారీ చేసింది. ఈ స్థితిలో ఓ మాజీ అధికారి ఏంటీ? కిడ్నాప్, దోపీడీకి పాల్పడటమేంటీ ? అనే ప్రశ్నలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఖలిస్తానీ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ హత్యకు కుట్రదారుడిగా అమెరికా పేర్కొన్న మాజీ రా అధికారి వికాష్ యాదవ్‌కు (Ex R &AW Officer Vikas Yadav) ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, అ ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికీ నోటీసు జారీ చేసింది. పదే పదే ఫోన్ చేసినప్పటికీ ఈ నిందితుడు యాదవ్ హాజరు కాలేదని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలర్ యాదవ్ నిందితుడు వికాస్ యాదవ్‌పై NBWలు జారీ చేశారు. ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తికి సెక్షన్ 491 BNS ప్రకారం అతని ష్యూరిటీని జప్తు చేయాలని ఆదేశించారు. రోహిణి ప్రాంతానికి చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ 2023 డిసెంబర్ 18న యాదవ్‌ను అరెస్టు చేసింది. బలవంతపు వసూళ్లు, కిడ్నాప్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Gangster Lawrence Bishnoi) తో ఆయనకు సంబంధం ఉందని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. ఇక ఖలిస్థాన్ ఏర్పాటువాది పన్నూన్ కేసులో యాదవ్ పేరును అమెరికా అధికారులు నమోదు చేసిన మూడు వారాల తర్వాత ఈ అరెస్టు జరిగింది.
పోలీసులు చార్జిషీట్ (Chargesheet) దాఖలు చేసినప్పటికీ, రోహిణి కేసులో యాదవ్, అతడి సహచరుడు బెయిల్ పై విడుదలయ్యారు. ఇంతలో, తన ప్రాణానికి ముప్పు ఉందని పేర్కొంటూ కోర్టుకు హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఢిల్లీ కోర్టులో యాదవ్ దరఖాస్తులు దాఖలు చేశారు, ఇది సరే మరో కొత్త వివాదంలోనూ యాదవ్ ఇరుక్కున్నారు. దుబాయ్‌లోని మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ (Online betting racket) సభ్యుడు అబ్దుల్లాఖాన్ తో యాదవ్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.