వరంగల్, ఆంధ్రప్రభ : వీరనారి చాకలి ఐలమ్మ (Chakali Ilamma) ఆశయాలు సాధించాలని పలువురు ప్రముఖులు అన్నారు. ఈ రోజు ఐలమ్మ 40వ వర్దంతి సందర్భంగా హనుమకొండ న్యూశాయంపేటలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ క్రమంలో వరంగల్ జిల్లా డాక్టర్ సత్యశారద, హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే (Vardhannapet MLA) కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
భువనగిరిలో…
యాదాద్రి భువనగిరి, ఆంధ్రప్రభ : వీరనారి చాకలి ఐలమ్మ (Chakali Ilamma) ఆశయాలు సాధించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) అన్నారు. ఈ రోజు ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, పోత్నాక ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.