death l వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు మృతి

death l వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు మృతి
కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించిన ఎంపీ కేసినేని చిన్ని
విస్సన్నపేట ఆంధ్రప్రభః విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన సాయి చైతన్య జ్యువలర్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మృతుడి భార్య గంధం నాగమణిని ఫోన్లో పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యం కోల్పోకుండా ఉండాలని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న కారణంగా ప్రత్యక్షంగా రావలేకపోయినట్లు పేర్కొన్న ఎంపీ చిన్ని, సమావేశాలు ముగిశాక నరసాపురం గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శిస్తానని నాగమణికి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
