Dead Body | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి (55) మృతదేహం లభించింది. ఆస్పత్రి సమీపంలో వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని గుర్తించిన స్థానికులు(the natives) పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని గుర్తించిన వారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్సై సైదులు కోరారు.
Dead Body | గుర్తుతెలియని మృతదేహం లభ్యం

