DEAD | బైక్ ఢీకొని బాలుడు మృతి…

DEAD | పల్నాడు జిల్లా, ఆంధ్రప్రభ : దాచేపల్లి మెయిన్ సెంటర్లో రోడ్డు దాటే క్రమంలో బైక్ ఢీకొని ఉమామహేశ్వరరావు అనే ఏడు సంవత్సరాల బాలుడు అక్కడక్కడే మృతి చెందాడు. బాలుడు స్వగ్రామం గురజాల మండలం దైద గ్రామం. ప్రస్తుతం బాలుడు తల్లి, బాలుడు దాచేపల్లిలో నివాసముంటున్నారు. రోడ్డు దాటుతుంటే కళ్ళముందే తన కొడుకు బైక్ ప్రమాదంలో మృతి చెందటంతో బాలుడి త‌ల్లి శోకసముద్రంలో మునిగిపోయింది. ప్ర‌మాదం జ‌ర‌గ‌గానే బైక‌ర్ ప‌రార‌య్యాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply