DCPs Transfers | పలువురు డీసీపీ ల బదిలీలు

DCPs Transfers | పలువురు డీసీపీ ల బదిలీలు
DCPs Transfers | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department) లో నాలుగు కమిషనరేట్ల (four commissionerates) పరిధిలో కొత్తగా ఏర్పాటైన జోన్లకు పలువురు డీసీపీలు బదిలీ (DCPs Transfers) అయ్యారు. చేవెళ్ల జోన్ డీసీపీగా యోగేష్ గౌతం, కూకట్‌పల్లి జోన్ డీసీపీగా రీతి రాజ్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట డీసీపీగా రక్షితా మూర్తి, రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ జోన్ డీసీపీగా సురేశ్, సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్ నియమితులయ్యారు. డీసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు (CS Ramakrishna Rao) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
