DC vs KKR | కోల్‌కతా స్పిన్ మ్యాజిక్.. ఢిల్లీపై ఘన విజయం !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో భాగంగా ఈరోజు జ‌రిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గెలుపొందింది. నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీతో త‌ల‌ప‌డిని కోల్‌కతా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కోల్‌కతా విజయంలో ముందుగా బ్యాటర్లు, ఆ తరువాత బౌలర్లు సమిష్టిగా రాణించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది. ఆ తరువాత 205 పరుగుల టార్గెట్ తో ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీని కోల్‌కతా బౌలర్లు కట్టడి చేశారు. దాంతో 9 వికెట్లు నష్టపోయి ఢిల్లీ 190 పరుగులకే పరిమితమైంది.

ఢిల్లీ బ్యాటర్లలో కేవలం ఓపెనర్ ఫాఫ్ డుప్లీసిస్ (62) అర్ధశతకంలో ఆకట్టుకోగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ (43) ఆఖర్లో విప్‌రాజ్ నిగ్గమ్ (38) పరుగులు సాధించారు. మిగిలినవారంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఆండ్రీ రస్సెల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

అంతకముందు కేకేఆర్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగులు సాధించింది. ఓపెన‌ర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (12 బంతుల్లో 26), సునీల్ నరైన్ (16 బంతుల్లో 27)తో పాటు కెప్టెన్ అజింక్యా రహానే (14 బంతుల్లో 26) పరుగులు సాధించారు. ఇక మిడిలార్డర్ లో అంగ్క్రిష్ రఘువంశీ (32 బంతుల్లో 44), రింకూ సింగ్ (25 బంతుల్లో 36), ఆండ్రీ రస్సెల్ (9 బంతుల్లో 17) రాణించారు.

ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో మెరిసాడు. అక్షర్ పటేల్, విప్రాజ్ నిగ్గమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. దుష్మంత చమీర ఒక వికెట్ తీశాడు. ఇక 205 పరుగుల విజయలక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ కు దిగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *