AP | దావోస్ టూర్ సక్సెస్.. చంద్రబాబు వచ్చేశారు
- ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన
- ఢిల్లీ మీదుగా ఉండవల్లి చేరుకున్న ముఖ్యమంత్రి
- దావోస్ పర్యటన వివరాలను నేతలతో పంచుకున్న వైనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవాం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గత రాత్రి ఢిల్లీ వచ్చిన ఆయన ఇవాళ… కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి ఉండవల్లి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం, అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు. దావోస్ పర్యటన వివరాలను నేతలతో పంచుకున్నారు. తాము సమావేశమైన కంపెనీలు, ఆ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న తీరును వివరించారు.
![](https://prabhanews.in/wp-content/uploads/2025/01/image-1024x768.png)