పెద్దవంగర, జూలై 4(ఆంధ్రప్రభ) : మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన వేముల సంతోష్ (Vemula Santosh) కు 2011 లో మంచిర్యాలకు చెందిన ఝాన్సీ (30) తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు అఖిల్ తేజ్, అభిదామిని ఉన్నారు. సంతోష్ స్థానికంగా సీఆర్పీ గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఝాన్సీ తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ (Teacher) గా పనిచేస్తుంది. ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఝాన్సీ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య (suicide) కు పాల్పడింది. కోడలు మరణ వార్త విన్న మామ వేముల లక్ష్మయ్య (70) తీవ్ర దిగ్భ్రాంతికి లోనై అక్కడికక్కడే గుండెపోటు (heart attack) తో మృతిచెందాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

