బోధన్, ఆంధ్రప్రభ : దత్త జయంతి వేడుకలను దేవాలయాల్లో భక్తులు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. త్రిమూర్తి అవతారమైన దత్తాత్రేయుడికి కీర్తనలు, భజనలతో ఆలయాలు మారుమోగాయి. సాలుర మండల కేంద్రంలో దత్తాత్రేయ జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేడిచెట్టు వద్ద ఉన్న దత్తాత్రేయ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వైభవంగా దత్త జయంతి వేడుకలు..

