పున:ప్రారంభం
- శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభం
- ముగిసిన చంద్ర గ్రహణం
- ఉదయం 8.30 నుండి యధావిధిగా అన్నప్రసాద వితరణ
తిరుమల : శ్రీవారి ఆలయం(Srivari Temple) లో సోమవారం ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. ఆదివారం రాత్రి 9.50 నుండి 1.31 గంటల వరకు చంద్ర గ్రహణం (lunar eclipse) ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం సాయంత్రం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూశారు.
దాదాపు 12గంటల అనంతరం సోమవారం ఉదయం 3గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆలయ శుద్ధి (Temple purification), పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
- అన్నప్రసాద వితరణ ప్రారంభం…
చంద్ర గ్రహణం (lunar eclipse) కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (Tarigonda Vengamamba) అన్నప్రసాదం కాంప్లెక్స్ ను 7.30 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం ఉదయం 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది.

