Dandepally | ఉత్తమ పురస్కారం అందుకున్న ఎస్సై

Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖలో విశేష సేవలందించిన దండేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఎండి తహసినోద్దీన్ కు ప్రభుత్వ ప్రశంస పత్రం పురస్కారంతో గౌరవం దక్కించుకున్నారు. ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఈ పురస్కర గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ప్రజలకు మరింత చేరువగా ఉండి సేవలు అందిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తానని అన్నారు.
