Dandepalli | కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు.

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలో ఈ రోజు కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆయా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నుంచి గెలుపొందిన సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని 28గ్రామ పంచాయతీలు ఉండగా, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరవేస్తామని అన్నారు. అనంతరం పదవి బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply