CWC | మీటింగ్ ప్రారంభం

CWC | మీటింగ్ ప్రారంభం
- హాజరైన సీఎం రేవంత్
- స్పెషల్ ఎట్రాక్షన్ గా శశిధరూర్
CWC | ఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో మరో కీలక రాజకీయ చర్చకు తెరలేచింది. రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతం, రాబోయే సవాళ్లు, జాతీయ స్థాయి వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ ఉన్నత నాయకత్వం ఢిల్లీలో భేటీ అయింది. ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ పరిణామాలపై ఈ మీటింగ్ కీలకంగా మారనుంది.
ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు పాటు ఇతర సీనియర్ నేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి శశిథరూర్ హాజరు కావడం ప్రత్యేక ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ మీటింగ్ లో ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ప్రధానంగా చర్చించనున్నారు. శశిధరూర్.. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎక్కువగా బీజేపీ నేతలతో కలిసి ఉంటుంటారు.. వారితో కలిసి ఉంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఉంటారు. దీంతో కాంగ్రెస్ తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే తాజాగా శనివారం జరుగుతున్న సీడబ్ల్యూసీ మీటింగ్ కు మాత్రం హాజరై స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
