Breaking: పోసానికి కస్టడీ పొడిగింపు

వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి కి బిగ్ షాక్ తగిలింది. రెండు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ నరసరావుపేట కోర్టు అనుమతించింది. ఈ మేరకు పోసానికి రేపు, ఎల్లుండి పోలీసులు విచారించనున్నారు. పోసాని కోరితే లాయర్ సమక్షంలో విచారణ చేయాలని సూచించింది. పోసాని బెయిల్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని కృష్ణమురళిపై నరసరావుపేట టుటౌన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఇప్పటికే పోసానిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే మరింత విచారణ చేయాలని, ఈ మేరకు పోసానిని ఐదు రోజులు పాటు కస్టడికి ఇవ్వాలని కోర్టును పోలీసులు అభ్యర్థించారు. ఈ మేరకు పోసానిని కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఓబులవారిపల్లె కేసులో బెయిల్…..
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు అయింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్​స్టేషన్​లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పోసాని కస్టడీ పిటిషన్​ను కోర్టు డిస్మిస్ చేసింది. గత నెల 27న పోసానిని ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *