Current shock | బ్రహ్మోత్సవాల్లో అపశృతి..

Current shock | బ్రహ్మోత్సవాల్లో అపశృతి..
Current shock, కొడిమ్యాల, ఆంధప్రభ : జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో వెంకటేశ్వర ఆలయ 2వ వార్షకోతత్సవం సందర్బంగా ఆలయ బ్రహ్మోత్వవాలు (Brahmotsavam) జరుగుతున్నాయి. ఈ వేడుకలను మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు స్వామి వారి కళ్యాణం జరుగుతున్న సమయంలో రాత్రి 11.55 ని.లకు తిప్పరవేణి మధుశ్రీ అనే 12 సంవత్సరాల అమ్మాయి విద్యుత్ షాక్ కు గురైంది.
మెట్లు ఎక్కే మార్గంలో స్టీల్ పైపులను అనుకొని వేసిన లైటింగ్ షాట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న మధుశ్రీకి విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. ఎలక్ట్రిక్ కు సంబంధించి సరైన జాగ్రత్తలు పాటించకుండా స్తంభాల నుండి మెయిన్ వైర్ల నుండి కనెక్షన్ ఇవ్వడమే ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణమని అంటున్నారు.
