Culine | పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్..

Culine | పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్..
Culine | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ : రెండో విడత ఎన్నికలు జరుగుతున్న హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని జడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం పరిశీలించారు. జడ్పీ పాఠశాల ప్రాంగణంలో బిఎల్ఓ కౌంటర్ వద్ద ఉన్న ఓటర్లతో మాట్లాడారు. ఓటరు స్లిప్పుల పంపిణీ గురించి బిఎల్ఓను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జడ్పీ, ప్రాథమిక పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళిని గురించి రిటర్నింగ్, పోలింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఎంత మంది ఓటర్లు ఓట్లు వేశారని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలలోకి క్యూ లైన్ లేకుండా.. పోలింగ్ కేంద్రం బయటనే క్యూలైన్ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఓటర్లు ఎక్కువగా ఉన్నందున కౌంటింగ్ కు ఐదు టేబుల్స్ వేసుకొని ఓట్ల లెక్కింపును చేపట్టాలని రిటర్నింగ్ అధికారికి సూచించారు. పోలింగ్ మెటీరియల్ ను జాగ్రత్తపర్చుకోవాలని అధికారులకు తెలియజేశారు. ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్నతో పాటు తహసీల్దార్ కోమి, మండల ప్రత్యేకాధికారి రవీందర్ సింగ్, ఇతర అధికారులు ఉన్నారు.
