CRPF | కానిస్టేబుల్ ఆత్మహత్య…

CRPF | కానిస్టేబుల్ ఆత్మహత్య…

CRPF | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాలకు చెందిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భాస్కరన్ 38 శనివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రి సెకండ్ బెటాలియన్ లో ఆయన కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఆయన పని మీద బనగానపల్లెకు వెళ్లి వచ్చారు. తిరిగి నంద్యాలకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణం ఏంటి అనేది తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply