ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ (Hyderabad)లో వినాయక నిమజ్జన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే శోభాయాత్రలు జోరుగా సాగుతున్నాయి. గణనాథులు గంగమ్మ ఒడికి చేరడానికి హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) వైపు కదులుతున్నాయి. ట్యాంక్‌బండ్ (Tank Bund) వద్ద నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నిమజ్జన తంతును చూడటానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనసంద్రంగా మారింది. సచివాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. నెక్లెస్ రోడ్ (Necklace Road), ఎన్టీఆర్ మార్గ్, సంజీవయ్య పార్క్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్‌లలో భారీ రద్దీ నెలకొంది.
ఖైరతాబాద్ (Khairatabad)బడా గణేష్, బలాపూర్ గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం శోభాయాత్రలో తరలి రాబోతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ (NTR Marg), పీపుల్స్ ప్లాజా, సంజీయవయ్య పార్క్ వైపున భారీ క్రేన్లను నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు. ఈసారి త్వరగా నిమజ్జన శోభాయాత్రను ముగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. రేపు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఆ రోజున నిమజ్జనాలు చెయ్యరు. కాబట్టే.. ఇవాళ త్వరగా చెయ్యాలనే ఉద్దేశంతో.. గత రాత్రి నుంచే నిమజ్జనం మొదలైంది.