CRIMES | గడ్డపార గ్యాంగ్‌ అరెస్ట్, రిమాండ్

CRIMES | గడ్డపార గ్యాంగ్‌ అరెస్ట్, రిమాండ్

  • దొంగిలించిన బంగారం, వెండి నగలు భారీగా స్వాధీనం
  • వాహన తనిఖీల్లో గ్యాంగ్‌పై కామారెడ్డి పోలీసుల పట్టు
  • చాకచక్యమైన ఆపరేషన్
  • జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర వెల్లడి


CRIMES | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కాగా సంఘటనకు సంబందించిన వివరాలను ఇవాళ‌ విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈనెల 2న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డపారతో ఇంటి తాళాలు పగులకొట్టి ఇంటిలోని బీరువా నుండి బంగారం, వెండి నగలు దొంగిలించార‌ని చిట్యాల గ్రామం, తాడ్వాయి మండలానికి చెందిన మసులా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది.

కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావ్ పర్యవేక్షణలో సదాశివనగర్ సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ సంతోష్, తాడ్వాయి, గాంధారి ఎస్సై లతో మూడు ప్రత్యక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ ల ఆదారంగా, నేర స్తలంలో దొరికిన ఆదారాలతో నిందితులు వచ్చి వెళ్ళిన మార్గాల్లో గల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, వారు నేరం చేయడానికి వాడిన టూ వీలర్ రిజిస్ట్రేషన్ నంబర్ లభించింది. దీనిని కొంత ఆధారంగా చేసుకొని విచారణ చేస్తూ… నేరస్తులు మళ్లీ నేరం చేసేందుకు వచ్చే అవకాశముందని తాడ్వాయి ఎస్సై తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా ఈ గడ్డపార గ్యాంగ్‌ (5) ఐదుగురిని పట్టుకున్నారు.

ఈ గ్యాంగ్ గత నాలుగు నెలలుగా తాడ్వాయి, గాంధారి లింగంపేట్, రాజంపేట్, బాన్సువా పరిధిలో కలిపి మొత్తం తొమ్మిది ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసినట్లు విచారణలో తెలిసింది. ఈ గ్యాంగ్ ప్రధానంగా పగలు, రాత్రి సమయాల్లో లాక్ చేసిన ఇళ్లను గుర్తించి, గడ్డపార, ఇనుప రాడ్లతో తలుపుల లాక్స్, బెడ్‌రూమ్, అల్మారీ లాక్స్ పగులగొట్టి బంగారం, వెండి నగలు, నగదు దొంగతనం చేసేవారన్నారు. నిందితులు దొంగిలించిన నగలను కొంతమంది అక్రమ గోల్డ్ కొనుగోలుదారులకు విక్రయించినట్లు కూడా ఒప్పుకున్నారు. అరెస్టు చేసిన నిందితులు బస్సి జోధ్‌రాజ్, అంకుష్ ప్రేమ్‌సింగ్, బామన్ మహేందర్, బి. హీరాలాల్ నూనవత్ గణేష్ లు. వారి నుండి బంగారం 11 తులాలు, వెండి నగలు 22 తులాలు, ఒక బైక్, 5 మొబైల్ ఫోన్లు, రూ.8500ల నగదు ఉన్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకున్న నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్, తాడ్వాయి యస్ఐ నరేష్, గాంధారి యస్ఐ ఆంజనేయులు, క్రైం స్టాఫ్ కానిస్టేబుల్ సాయిబాబా, రవి, సంజీవ్, వసంత్ పేట్రోలింగ్ టీమ్స్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply