Crime | లైంగిక‌దాడి.. హ‌త్య‌!?

Crime | లైంగిక‌దాడి.. హ‌త్య‌!?

  • చిన్నారిని చిదిమేసింది.. కామాంధుడేనా?

Crime | మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో ఏడేళ్ల బాలిక నిన్న‌అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ చిన్నారిని వారి ఇంటి సమీపంలోనే ఉండే ఓ కామాంధుడు లైంగిక‌దాడికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసుల విచార‌ణ‌లో తెలిసిన‌ట్లు స‌మాచారం.

కొన్ని రోజులుగా పోకిరిగా తిరుగుతుండే అగంతకుడు ఈ మధ్య కాలంలో గంజాయి కూడా సేవిస్తున్నట్లు తెలిసింది. చిన్నారి పై లైంగిక‌దాడికి(sexual assault) పాల్పడి హత్య చేసినట్లుగా భావిస్తున్న నిందితుడు పక్కా గంజాయి సేవిస్తుండేవాడని తెలుస్తోంది. చిన్నారి గత సోమవారం ఇంటి సమీపంలో ఆడుకుంటూనే అదృశ్యమై పోయింది.

దీంతో అక్కడ ఇక్కడ వెతికిన తల్లిదండ్రులు చివరికి దండేపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఇంటి వద్ద ఆడుకునే తమ కూతురు కనిపించడం లేదని ఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. బాధిత తల్లిదండ్రుల సమాచారం మేరకు మంగళ, బుధవారాల్లో పలుచోట్ల గాలించినప్పటికీ ఆ బాలిక‌ జాడ లేకుండా పోయింది. గురువారం ఉదయం ఒక వ్యవసాయ బావిలో రైతు కరెంటు పైపు తీస్తుండగా మృతదేహం లభ్యమైంది.

వ్యవసాయ బావిలో బాలిక‌ శవమై తేలడంతో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మ‌రం చేశారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్(ACP Prakash) ఆధ్వర్యంలో సీఐ రమణమూర్తి, దండెపల్లి ఎస్సై తహసీనొద్దీన్ విచార‌ణ‌లో నిందితుడిని గుర్తించారు. దీంతో ఈ రోజు సాయంత్రానికల్లా విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి రిమాండ్ కు పంపే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply