- నంద్యాల ఎస్పీ క్లాస్
నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో : ఆధునిక టెక్నాలజీ ఆధారంతో నేరగాళ్లను గుర్తించాలని, ముందస్తుగా కట్టడి చేసే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, జిల్లాలో నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణ కొరకు తీసుకోవలసిన చర్యలపై ప్రాధాన్యత క్రమంలో వివరించారు. నంద్యాల బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా సబ్ డివిజన్ పోలీసు అధికారులతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ కేసుల స్థితిగతులను, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (CCTNS) లో అప్ లోడ్ అంశాల ఆధారంగా సమీక్ష నిర్వహించారు.ప్రస్తుతం నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు వాటి వివరాలు పురోగతిపై ఆరా తీసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి , నేరాల నియంత్రణతో పాటు నేరస్ధులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం లో ఎప్పటి కప్పుడు పొందుపర్చాలన్నారు.
అన్ని వివరాలు నమోదు చేయడం వల్ల కేసులు, వ్యక్తుల పూర్తి సమాచారం తెలుస్తుందని అది అందరికీ ఉపయోగపడేలా దోహదం చేస్తుందన్నారు. గ్రేవ్ కేసులు, యూ ఎల్ కేసులు, పి టీ కేసులు , మర్డర్ , సైబర్ క్రైమ్ కేసులు, పోక్సో కేసులు , మిస్సింగ్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులపై ఆరా తీస్తూ వాటి దర్యాప్తు పురోగతిపై ప్రత్యక దృష్టి ఉంచాలని నేరం చేసిన వారికి శిక్ష పడేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని అధికారులకు సూచించారు.మిస్సింగ్ కేసులు, అన్ ఐడెంటిఫైడ్ డెత్ బాడీ కేసులో క్రిమినల్ ఇంటిలిజెన్స్ సిస్టం అప్లికేషన్ లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని కేసులలో పురోగతి సాధించాలన్నారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఎన్ డి పి ఎస్ , పోక్సో కేసులలో నిందితులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాల నివారణ కొరకు తీసుకోవలసిన చర్యలు అనగా హెచ్చరిక బోర్డ్ లు, క్యాట్ ఐస్, రోడ్డు బోర్డర్ లైన్స్ ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వీటికే అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దిశ నిర్దేశం చేశారు. జిల్లా బోర్డర్ టోల్ గేట్ లలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తు గంజాయి,అక్రమమధ్యం, పిడిఎస్ రైస్ ఇతర నిషేదితమైనవి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్ ఫోర్స్ మెంట్ పై ప్రత్యక దృష్టి ఉంచాలన్నారు.ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా నిరోధించాలని, బహిరంగ మధ్యపానం, డ్రంక్ అండ్ డ్రైవ్ , మైనర్ డ్రైవింగ్ పై చర్యలు తీసుకో వాలి, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా పెంచి, తగిన చర్యలు తీసుకోవాలని వీటి నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యాక్రమం లో ఏ ఎస్ పి ఎం. జావళి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు పాల్గొన్నారు..

