CRIME | మంత్రాల నెపంతో…
- గిరిజన వృద్ధుడిని హత్య చేసి కాల్చి వేశారు…
- సంఘటన స్థలాన్ని సందర్శించిన ఖానాపూర్ సిఐ
- నిర్మల్ జిల్లా కడెం మండలంలో సంఘటన
CRIME | కడెం, ఆంధ్రప్రభ : మంత్రాల నెపంతో ఒక వ్యక్తిని హత్య చేసి కాల్చి బూడిది చేసిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గండి గోపాల్ పూర్ గ్రామానికి చెందిన నాయకపు గిరిజనుడు దేశినేని భీమయ్య (55) అనే వ్యక్తిని ఈనెల 10న రాత్రి సమయాన అదే గ్రామానికి చెందిన మూతి నరేష్, అతని అన్న మూతి మల్లేష్ ఇద్దరు కలిసి భీమయ్యను కట్టెతో కొట్టి హత్య చేసి ఊరు సమీపంలోని అటవీ ప్రాంతంలో కాల్చి బూడిది చేశారని సీఐ తెలిపారు.
మృత్తునికి ఇద్దరు కుమార్తెలు కాగా, వారికి పెళ్లిళ్లు అయ్యాయి. మృతుడు తన తన భార్యతో ఉంటున్నాడన్నారు. హత్యకు గల కారణాలు తెలుసుకొనుటకు ఖానాపూర్ సీఐ అజయ్ కడెం పిఎస్ సాయి కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపి కేసు నమోదు చేశారు. హంతకులు మంత్రాల నెపంతో భీమయ్యను హత్య చేసినట్టు విచారణలో తెలిపినట్లు ఖానాపూర్ సిఐ అజయ్ కుమార్ తెలిపారు.

