భార్య, అత్తను కత్తితో నరికి…

భార్య, అత్తను కత్తితో నరికి…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓ వ్యక్తి తన భార్య, అత్తను కత్తితో నరికి చంపిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సీతానగరం మండలం బొబ్బిలంకకు చెందిన సోడదాసి సీతారామరాజు, లత ప్రేమ వివాహం చేసుకున్నారు. గతకొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంట్లో ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు.. లత, లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

Leave a Reply