Crickter | రాయుడికి వార‌సుడొచ్చాడు

Crickter | రాయుడికి వార‌సుడొచ్చాడు

  • తండ్రి అయిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

Crickter | వెబ్‌డెస్క్‌(స్పోర్ట్స్‌), ఆంధ్ర‌ప్ర‌భ : తెలుగు రాష్ట్రాల గర్వకారణం, టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఇంట్లో మరోసారి సంతోషాల పండగ వాతావరణం నెలకొంది. రాయుడు మూడోసారి తండ్రి అయ్యారు. అంబటి రాయుడు తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీ‌ని అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు, అంబటి రాయుడుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా విద్యను రాయుడు 2009లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగులలో ఆడుతూ క్రికెట్ కామెంటరీ చేస్తున్నారు.

Crickter | అంబటి రాయుడు చరిత్ర ఇదే..

టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులో (Guntur) జన్మించాడు. ఇతడు చిన్నతనం నుంచే బ్యాటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి, దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ తరపున ఆడేవాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో కీలక ఆటగాడు రాయుడు. అయితే రాయుడికి అంతర్జాతీయ క్రికెట్‌లో తన టాలెంట్‌కు తగిన గుర్తింపు లభించకపోవడంతో.. 2019 ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడంతో నిరాశ చెంది ఇంటర్ నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Crickter | రాజ‌కీయాల వైపు..

క్రికెట్‌లో రాణించిన రాయుడు.. రాజకీయాల్లో మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. ఏపీలో వైసీపీ తరఫున రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. గుంటూరు పార్లమెంట్ బరిలో నిలిచేందుకు కూడా సిద్ధమయ్యారు. గుంటూరు పార్లమెంట్ (Parlament) పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్త్రతంగా పర్యటించారు. ఈ క్రమంలోనే అతనికి స్థానికత బాగా కలిసివచ్చింది. సామాజిక బలం కూడా తొడైంది. అనంతరం అన్యూహ్యాంగా మరో వ్యక్తి పేరును గుంటూరు ఎంపీ స్థానానికి నిలిపేందుకు వైసీపీ ప్రయత్నించడంతో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి గుడ్ బాయ్ చెప్పేశారు. అనంతరం జనసేన లో చేరారు.ప్రస్తుతం కామెంటర్ గా మాత్రమే వ్యవహరిస్తున్న రాయుడు.. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

CLICK HERE TO READ  కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు బీసీసీఐ ఆర్డ‌ర్‌

CLICK HERE TO READ MORE

Leave a Reply