Cricketer | కోమాలోకి మాజీ క్రికెట‌ర్‌

Cricketer | కోమాలోకి మాజీ క్రికెట‌ర్‌

  • మెనింజైటిస్ సోకడంతో కోమాలోకి వెళ్లిన డెమియన్ మార్టిన్
  • బ్రిస్బేన్ ఆసుపత్రిలో చికిత్స

Cricketer | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ తీవ్ర అస్వస్థతతో బ్రిస్బేన్‌లోని ఆసుపత్రి(hospital)లో చికిత్స పొందుతున్నారని ఆస్ట్రేలియా మీడియా ఈ రోజు పేర్కొంది. 54 ఏళ్ల ఈ మాజీ కుడిచేతి వాటం బ్యాటర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మెనింజైటిస్ (మెదడు వాపు వ్యాధి) సోకడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రిస్బేన్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయన కోమాలో ఉన్నారని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఆస్ట్రేలియా మీడియా(Australian media) కథనాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మార్టిన్ అస్వస్థత వార్త తెలిసి క్రికెట్ లోకం షాక్‌కు గురైంది. ఆయన త్వరగా కోలుకోవాలని మాజీ సహచర ఆటగాళ్లు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మార్టిన్ కెరీర్ ఇలా..

ఆస్ట్రేలియా తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడిన మార్టిన్.. మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్‌గా సేవలందించాడు. టెస్టుల్లో 46.37 సగటుతో 13 సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా 1999, 2003 వరల్డ్ కప్(World Cup) గెలిచిన ఆసీస్ జట్లలో ఆయన సభ్యుడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై విరిగిన వేలితోనే బ్యాటింగ్ చేసి అజేయంగా 88 పరుగులు సాధించిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మార్టిన్, ఆ తర్వాత కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

Leave a Reply