Cricket | గెలుపు ఓటములు సహజం

Cricket | గెలుపు ఓటములు సహజం

  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించిన యువ క్రికెటర్ కంకణాల వంశీకృష్ణ,

Cricket | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడు, భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన మాజీ జెడ్పీటిసి దివంగత కొండ ప్రకాశ్ గౌడ్ స్మారక సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్(Cricket tournament)ను స్థానిక శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో తొలి మ్యాచ్ ను ఈ రోజు భీమ్‌గల్‌ పట్టణంలోని కృషి హై స్కూల్ ప్రక్కనగల క్రీడా మైదానంలో ఆరంభించారు.

ఎస్ఎస్ నగర్ తండా వర్సెస్ శ్రీరామ్ యూత్ తలపడగా భీమ్‌గల్‌ పట్టణానికి చెందిన శ్రీరామ్ యూత్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. ప్రముఖ యువ క్రికెటర్ కంకణాల వంశీకృష్ణ “మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్” దక్కించుకున్నాడు. కప్ (ట్రోఫీ) ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు నిచ్చెమోల్ల రాజేశ్వర్, కొండల్, రఘు, ఉడుత మహేశ్, చేపూర్ రాజు, తోపారం సురేందర్, రేగుళ్ల అరుణ్ కుమార్ తో పాటు శ్రీరామ్ యూత్ క్రికెట్ ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply