Cricket Tournament | మీ సావు.. మీరు సావండి..!

Cricket Tournament | మీ సావు.. మీరు సావండి..!

  • మీతో మాకేంటి..?
  • మేం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడ‌తాం
  • తేల్చిచెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

Cricket Tournament | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వ‌చ్చే నెల 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ టోర్నీలో బంగ్లాదేశ్(Bangladesh) పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా భార‌త్‌లో మ్యాచ్‌లు ఆడ‌మ‌ని మొండికేసి కూర్చుంది.

బంగ్లాదేశ్ దౌత్యపరమైన, క్రికెట్ పరమైన మద్దతు కోసం పాకిస్థాన్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నమెంట్‌ను బహిష్కరిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను పీసీబీ వర్గాలు తోసిపుచ్చాయి. బంగ్లాదేశ్‌తో మాకేమి సంబంధం లేద‌ని, మేం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతామ‌ని తేల్చి చెప్పింది.

Cricket Tournament |

టోర్నమెంట్ నుంచి వైదొలగే ఆలోచన తమకు లేదని పీసీబీ ఖరాఖండిగా ప్రకటించింది. అయినప్పటికీ, పాకిస్థాన్ మ్యాచ్‌లు పూర్తిగా శ్రీలంకలోనే షెడ్యూల్ కావడంతో, టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని పీసీబీ స్పష్టం చేసింది.

Leave a Reply